Devineni Uma: సచివాలయాలకు స్టేషనరీ సరఫరాలో కోట్ల రూపాయలు స్వాహా: దేవినేని ఉమ

devineni uma slams jagan
  • రూ.1000 వస్తువులకు కాంట్రాక్టర్లకు 3,000 రూపాయల చెల్లింపు
  • తక్కువ మెటీరియల్ సరఫరా
  • ప్రింటర్ కు ఇంకు, దరఖాస్తుకు కాగితాలు లేవంటున్నారు
  • దరఖాస్తుదారుల నుండి డబ్బు వసూలు
సచివాలయాలకు స్టేషనరీ సరఫరాలో కోట్ల రూపాయలు స్వాహా అవుతున్నాయంటూ ఆంధ్రప్రదేశ్ లోని పరిస్థితులను వివరిస్తూ ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ఓ కథనాన్ని పోస్ట్ చేస్తూ వైసీపీ సర్కారుపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. దీనికి సీఎం జగన్ సమాధానం చెప్పాల్సిందేనని ఆయన నిలదీశారు.

‘సచివాలయాలకు స్టేషనరీ సరఫరాలో కోట్ల రూపాయల స్వాహా, రూ.1000 వస్తువులకు కాంట్రాక్టర్లకు 3,000 రూపాయల చెల్లింపు, తక్కువ మెటీరియల్ సరఫరా, ప్రింటర్ కు ఇంకు, దరఖాస్తుకు కాగితాలు లేవంటూ దరఖాస్తుదారుల నుండి డబ్బు వసూలు, కాంట్రాక్టు సంస్థ ఎవరిదో.. డబుల్ దోపిడీ బాగోతంపై ప్రజలకు సమాధానం చెప్పండి వైఎస్ జగన్ గారు’ అని దేవినేని ఉమ ప్రశ్నించారు.


Devineni Uma
Telugudesam
YSRCP

More Telugu News