దుర్గం చెరువు వంతెనపై నేడు కూడా వాహనాలకు అనుమతి

18-10-2020 Sun 07:00
cyberabad police allow vehicles over durgam cheruvu bridge
  • వారాంతాల్లో బ్రిడ్జిపైకి వాహనాలకు అనుమతి నిల్
  • భారీ వర్షాల కారణంగా ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు అనుమతి
  • పర్యాటకులు రావొద్దని వినతి

నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో దుర్గం చెరువు బ్రిడ్జిపై నుంచి వాహనాలను అనుమతిస్తున్నట్టు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నిన్నటి నుంచి నేటి వరకు వాహనాల రాకపోకలకు అనుమతి ఇస్తున్నట్టు పేర్కొన్నారు. జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ మధ్య ప్రయాణానికి వాహనదారులు ఈ బ్రిడ్జిని ఉపయోగించుకోవచ్చన్నారు.

అయితే, వారాంతాలలో వంతెనను సందర్శించకపోవడమే మంచిదని సూచించారు. నిజానికి శని, ఆదివారాల్లో బ్రిడ్జిపైకి వాహనాలను నిలిపివేసి సందర్శకులను మాత్రమే అనుమతిస్తున్నారు. అయితే, నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

.