Mekathoti Sucharitha: విజయవాడలో దివ్య తేజస్విని కుటుంబ సభ్యులను పరామర్శించిన హోంమంత్రి సుచరిత

Home minister Sucharitha visits Divya Tejaswini parents
  • బెజవాడలో దివ్య తేజస్విని అనే బీటెక్ విద్యార్థిని హత్య
  • ప్రేమోన్మాది ఘాతుకం
  • హోంమంత్రికి లేఖ అందించిన దివ్య తల్లిదండ్రులు
ఇటీవల విజయవాడలో దివ్య తేజస్విని అనే బీటెక్ విద్యార్థిని ప్రేమోన్మాది చేతిలో బలైపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మృతురాలి కుటుంబసభ్యులను ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత నేడు పరామర్శించారు. విజయవాడ వచ్చిన ఆమె దివ్య కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని ఆమె వారితో తెలిపారు.

దివ్య కుటుంబానికి ఏపీ సర్కారు అన్ని విధాలా అండగా ఉంటుందని, తప్పకుండా న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా సుచరిత.... దివ్య తేజస్విని చిత్రపటానికి నివాళులు అర్పించారు. తమ నివాసానికి వచ్చిన రాష్ట్ర హోంమంత్రికి దివ్య తల్లిదండ్రులు విజ్ఞాపన పత్రం అందించారు.

ప్రతి ఒక్కరూ దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని, చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సుచరిత సూచించారు. అమ్మాయిలు సమస్యల పట్ల ధైర్యంగా వ్యవహరించాలని, తమ ఇబ్బందులను తల్లిదండ్రుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు.
Mekathoti Sucharitha
Home Minister
Divya Tejaswini
Vijayawada

More Telugu News