డీడీసీఏ అధ్యక్షుడిగా అరుణ్ జైట్లీ కుమారుడు ఏకగ్రీవం
- ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రోహన్ జైట్లీ ఎన్నిక
- రోహన్ పై ఎవరూ పోటీ చేయని వైనం
- 2021 జూన్ వరకు పదవిలో ఉండనున్న రోహన్
వాస్తవానికి న్యాయవాద వృత్తిలో కొనసాగాలని రోహన్ భావించారు. కానీ నేతలు, స్థానిక అధికారుల సూచనలతో ఆయన డీడీసీఏ అధ్యక్ష పదవికి పోటీ పడ్డారు. ఆయనకు పోటీగా ఎవరూ నిలవకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రోహన్ కు పలువురు రాజకీయ, క్రీడా ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో అధ్యక్ష పదవికి రజత్ శర్మ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఆ పదవికి ఎన్నికలు జరిగాయి.