నారా లోకేశ్ కు తెలియకపోతే వాళ్ల నాన్నను అడిగి తెలుసుకోవాలి: బొత్స

17-10-2020 Sat 15:49
Lokesh has to learn from his father says Botsa
  • వరద నష్టం విషయంలో ప్రభుత్వంపై నారా లోకేశ్ విమర్శలు
  • జగన్ వాస్తవ పరిస్థితిని చూడాలని డిమాండ్
  • వర్షాలు తగ్గాక నష్టాన్ని అంచనా వేస్తామన్న బొత్స

భారీ వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 8 వేల ఇళ్లు నీట మునిగాయని, 14 మంది ప్రాణాలు కోల్పోయారని, దీనికి కారణం వైసీపీ ప్రభుత్వ అలసత్వమేనని టీడీపీ నేత నారా లోకేశ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. భారీ ఎత్తున నష్టం జరిగిందని... ముఖ్యమంత్రి జగన్ ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి వాస్తవ పరిస్థితిని చూడాలని అన్నారు.

ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ లోకేశ్ పై మండిపడ్డారు. నారా లోకేశ్ కు ఇంకా అంత పరిజ్ఞానం రాలేదని బొత్స ఎద్దేవా చేశారు. వర్షాలు తగ్గకుండానే నష్టాన్ని ఎలా అంచనా వేస్తారని ప్రశ్నించారు. ఆయనకు తెలియకపోతే ఆయన తండ్రి చంద్రబాబును అడిగి తెలుసుకోవాలని అన్నారు. వర్షాలు తగ్గిన తర్వాత నష్టాన్ని అంచనా వేసి, తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.