గొప్పలు చెప్పిన రోజా ఇప్పుడెందుకు సైలెంట్ గా ఉన్నారు?: అనిత

16-10-2020 Fri 18:14
Who Roja is silent asks Anitha
  • దిశ చట్టం గురించి రోజా చాలా గొప్పగా చెప్పారు
  • యువతులు బలవుతుంటే మౌనంగా ఉంటున్నారు
  • వైసీపీది ప్రచార ఆర్భాటం మాత్రమే

వైసీపీది ప్రచార ఆర్భాటం తప్ప మరేమీ లేదని టీడీపీ నాయకురాలు అనిత విమర్శించారు. దిశ బిల్లు ఆమోదం పొందక ముందే దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారని... ఇది ప్రచారం చేసుకోవడం కాదా? అని ప్రశ్నించారు. దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసినా రాష్ట్రంలో మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

 ముఖ్యమంత్రి జగన్ నివాసానికి కూతవేటు దూరంలోనే వారం వ్యవధిలో ఇద్దరు యువతులు ఉన్మాదుల చేతిలో బలయ్యారని... రాష్ట్రంలో రక్షణ వ్యవస్థ ఏమైందని ప్రశ్నించారు. దిశ చట్టం గురించి వైసీపీ ఎమ్మెల్యే రోజా అసెంబ్లీలో చాలా గొప్పగా చెప్పారని... ఇప్పుడు ఆమె నోరు మెదపకుండా మౌనంగా ఎందుకుంటున్నారని మండిపడ్డారు.