గంగవ్వ ఇంటికి వెళ్లిన బిత్తిరి సత్తి, సుజాత!

16-10-2020 Fri 11:06
Bittiri Satti Went To Gangavva House
  • అనారోగ్యంతో తప్పుకున్న గంగవ్వ
  • లంబాడిపల్లి గ్రామానికి వెళ్లిన యాంకర్లు
  • యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న సత్తి

టాలీవుడ్ అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్-4లో అనుకోని అతిథిగా ప్రవేశించి, తన మాటతీరు, చేష్టలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుని, అనారోగ్యం కారణంగా గత వారం హౌస్ నుంచి బయటకు వచ్చిన గంగవ్వను హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సుజాత, బిత్తిరి సత్తి ప్రత్యేకంగా వెళ్లి కలిశారు.

మల్యాల మండలంలోని లంబాడిపల్లి గ్రామానికి వెళ్లిన వీరిద్దరూ, గంగవ్వ ఇంటి తలుపు తట్టారు. ఆమె యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆపై గంగవ్వ వీడియోలను తీసి, ఆమెకు ప్రాచుర్యం కల్పించిన మై విలేజ్ షో డైరెక్టర్ శ్రీరామ్ శ్రీకాంత్ ను, అతని బృందాన్ని కూడా వీరు కలిశారు.