జేసీబీ సాయంతో వీపు గోక్కున్నాడు... తెగ వైరల్ అవుతున్న వీడియో ఇది!

16-10-2020 Fri 10:08
JCB Scartchs Man Back Viral Video
  • వ్యక్తి వీపుపై పడిన మట్టి
  • దురద పుట్టడంతో జేసీబీ సాయం
  • ప్రసారం చేస్తున్న టీవీ చానెల్స్

ఎవరైనా జేసీబీని ఎందుకు వాడతారు? మట్టి తోడటానికి, గుంతలు తీయడానికి, అవసరం లేని గోడలు పగులగొట్టడానికి వాడుతారు. కానీ ఓ వ్యక్తి, తన వీపును గోక్కోవడానికి జేసీబీ ఎక్స్ కావేటర్ ను వాడగా, ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. 41 సెకన్ల నిడివి వున్న ఈ వీడియో తొలుత ఫేస్ బుక్ లో షేర్ అయింది.

ఓ కన్ స్ట్రక్షన్ సైట్ లో జేసీబీ పనిచేస్తుండగా, ఓ వ్యక్తి తన వీపును రుద్దుకుంటూ, ఈ జేసీబీ కిందకు వచ్చాడు. ఆ వెంటనే దాని ఆపరేటర్ సదరు వ్యక్తి వీపుపైకి జేసీబీని తీసుకుని వచ్చి, మెల్లిగా వీపు గోకడం ప్రారంభించాడు. ఈ వీడియోను చూసిన వాళ్లంతా తెగ నవ్వుకుంటున్నారట. ఈ వీడియోను దేశవ్యాప్తంగా అన్ని భాషల్లోని టీవీ చానెల్స్ ప్రసారం చేస్తున్నాయి. దాన్ని మీరు కూడా చూసేయండి.