ప్రముఖ నటుడు వివేక్ ఒబెరాయ్ ఇంట్లో పోలీసుల సోదాలు

15-10-2020 Thu 18:13
Vivek Oberois Home Searched As Cops Look For Relative in Drugs Case
  • కన్నడ సినీ పరిశ్రమను కుదిపేస్తున్న డ్రగ్స్ వ్యవహారం
  • పరారీలో ఉన్న నిందితుడు ఆదిత్య అల్వా
  • వివేక్ ఒబెరాయ్ కి బంధువు ఆదిత్య

సినీ నటుడు వివేక్ ఒబెరాయ్ నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే కన్నడ సినీ పరిశ్రమను డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. డ్రగ్స్ కేసులో నిందితుడైన ఆదిత్య అల్వా పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆదిత్య బంధువైన వివేక్ ఒబెరాయ్ ఇంట్లో బెంగళూరు పోలీసులు సోదాలు నిర్వహించారు. కోర్టు వారంట్ తీసుకున్న తర్వాతే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వివేక్ ఇంటికి వెళ్లారు. వివేక్ ఇంట్లో ఆదిత్య ఉన్నాడనే సమాచారంతోనే తాము సోదాలు నిర్వహించామని పోలీసులు తెలిపారు. ఇప్పటికే డ్రగ్స్ వ్యవహారంలో కన్నడ హీరోయిన్లు సంజన, రాగిణితో పాటు మరో 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.