తక్షణమే రూ. 1,350 కోట్లు సాయం చేయండి: మోదీకి కేసీఆర్ లేఖ

15-10-2020 Thu 17:38
KCR writes letter to Modi for flood relief funds
  • రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి
  • రూ. 5 వేల కోట్లకు పైగా నష్టం జరిగింది
  • కేంద్రం తరపున సాయం చేయండి

హైదరాబాద్ సహా తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని భారీ వర్షాలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఈ వర్షాలు, వరదల వల్ల భారీ నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలు వర్షాల వల్ల నష్టపోయాయని... ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సాయం అందించాలని లేఖలో కోరారు. ప్రాథమిక అంచనాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రూ. 5 వేల కోట్లకు పైగా నష్టం జరిగినట్టు చెప్పారు. తక్షణ సాయం, పునరావాస చర్యల కోసం వెంటనే రూ. 1,350 కోట్లను అందించాలని కోరారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.