ప్లాస్మా దానం చేసిన తమ్ముడు నాగబాబుకు అభినందనలు: చిరంజీవి

15-10-2020 Thu 17:00
Chiranjeevi congratulates Nagababu
  • కరోనా నుంచి కోలుకున్న తర్వాత ప్లాస్మా దానం చేసిన నాగబాబు
  • మరికొందరిని కాపాడడానికి ప్లాస్మా దానం చేశాడని చిరంజీవి కితాబు
  • అందరూ ప్లాస్మా దానం చేయాలని పిలుపు

సినీ నటుడు నాగబాబు కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా బాధితులను కాపాడాలనే మంచి లక్ష్యంతో ఆయన ప్లాస్మాను దానం చేశారు. ఈ నేపథ్యంలో చిరంజీవి స్పందించారు. నాగబాబుకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. 'కరోనాపై పోరాడి గెలవడమే కాకుండా... మరికొందరిని కాపాడే క్రమంలో ప్లాస్మా దానం చేసిన తమ్ముడు నాగబాబుకి అభినందనలు. ఈ సందర్భంగా కోవిడ్ నుంచి కోలుకున్నవారికి మరోమారు నా విన్నపం. మీరు ప్లాస్మా డొనేట్ చేస్తే ఇంకా ఎందరో కోలుకుంటారు. దయచేసి ముందుకు రండి' అని ట్వీట్ చేశారు.