నయా ఫిజ్ కోసం జూనియర్ ఎన్టీఆర్ సరికొత్త వాణిజ్య ప్రకటన

15-10-2020 Thu 16:38
Junior NTR acts in new B Fizz ad
  • 'బీ ఫిజ్' పేరిట మరో శీతలపానీయం
  • యాడ్ షూట్ పూర్తి చేసిన ఎన్టీఆర్
  • నెట్టింట సందడి చేస్తున్న యాడ్ వీడియో

భారత్ లో విశేష ప్రజాదరణ పొందిన శీతలపానీయం ఫిజ్ కు సంబంధించిన వాణిజ్య ప్రకటనల్లో జూనియర్ ఎన్టీఆర్ నటించారు. తాజాగా 'బీ ఫిజ్' పేరిట కొత్త ఉత్పత్తి వచ్చింది. ఈ ప్రొడక్ట్ కు సంబంధించిన సరికొత్త యాడ్ లో ఎన్టీఆర్ కనువిందు చేశారు. ఇటీవలే ఈ యాడ్ షూట్ నిర్వహించారు. 'ఆర్ఆర్ఆర్' చిత్రం కోసం స్లిమ్ గా మారిన ఎన్టీఆర్ ఈ యాడ్ లో మరింత ఉత్సాహంగా కనిపించారు. తనదైన శైలిలో స్టెప్పులు వేసి అలరించారు. "ఇంట్రడ్యూసింగ్ బీ ఫిజ్... బీ ద ఫిజ్" అంటూ డైలాగ్ చెప్పారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ యాడ్ వీడియో  సందడి చేస్తోంది.