'థాంక్యూ మామా' అంటూ చిరంజీవికి సాయితేజ్ రిప్లై

15-10-2020 Thu 12:49
sai tej thanks to chiru
  • సాయి తేజ్ హీరోగా ‘సోలో బ్రతుకే సో బెటర్’
  • ‘అమృత’ సాంగ్ విడుదల చేసిన చిరు
  • సాయితేజ్ కి బర్త్ డే విషెస్ చెప్పిన చిరంజీవి 

మెగా హీరో సాయి తేజ్ నటిస్తోన్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా నుంచి మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ‘అమృత’  పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన సాయితేజ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సోలో బ్రతుకే సో బెటర్ సినిమా నుంచి పాట విడుదల చేసి, తనకు శుభాకాంక్షలు తెలిపినందుకు సాయితేజ్ హర్షం వ్యక్తం చేశాడు.  

ఇదే తనకు వచ్చిన బెస్ట్ బర్త్ డే గిఫ్ట్ అని ఆయన చెప్పాడు. ఈ రోజును ప్రత్యేకంగా మార్చినందుకు ధన్యవాదాలు మామ అంటూ చిరంజీవిని ఉద్దేశించి ట్వీట్ చేశాడు. లవ్యూ సో మచ్ అని, ఆయన నుంచి ఆశీర్వాదాలు తప్ప ఇంకేమీ అడగనని తెలిపాడు. కాగా, ఈ సినిమా నుంచి ఇప్పటికి మూడు పాటలు విడుదలయ్యాయి.

ఈ సినిమాలో పెళ్లి చేసుకోకుండా బతికితేనే జీవితం బాగుంటుందని చెప్పే పాత్రలో సాయితేజ్ నటించాడు. చివరకు ఆయన ఓ అమ్మాయి ప్రేమలో పడతాడని తెలుస్తోంది. ఆ ప్రేమ విఫలం కావడంతో  లవ్ బ్రేకప్ సాంగ్ పాడతాడు. ’బల్బు కనిపెట్టినోడికే బతుకు చిమ్మ చీకటైపోయిందే, సెల్ ఫోన్ కంపెనోడికే సిమ్ కార్డు బ్లాకై పోయిందే’ అంటూ ఈ పాట ప్రారంభమవుతుంది. ఒగ్గేసి పోకే ‘అమృత’ అంటూ ఈ పాట సాగుతుంది.