సోము వీర్రాజుకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రశంసలు కురిపించిన పవన్ కల్యాణ్

15-10-2020 Thu 12:29
pawan wishes somu veerraju
  • నేడు సోము వీర్రాజుకి బర్త్ డే  
  • యువ రాజకీయ వేత్తగా బీజేపీలోకి అడుగుపెట్టారు
  • మొక్కవోని దీక్షతో బీజేపీతోనే రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు
  • ప్రజలకు మంచి భవిష్యత్తు అందించడానికి పనిచేస్తాం

బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజుకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనను కొనియాడారు. యువ రాజకీయ వేత్తగా బీజేపీలోకి అడుగుపెట్టి ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా మొక్కవోని దీక్షతో ఆయన బీజేపీతోనే రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారని చెప్పారు.

ఆ నిబద్ధతను గుర్తించిన బీజేపీ అగ్ర నాయకత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన తుది వరకు నిలబడతారని, పార్టీకి మంచి ఫలితాలు అందిస్తారని ఆయనను బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా ఎన్నుకుందని చెప్పారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై అవగాహన, పాలన, విధానపరమైన అంశాలపై పట్టు ఉన్న నేత సోము వీర్రాజని కొనియాడారు. ప్రజలకు మంచి భవిష్యత్తు అందించడానికి వీర్రాజు నాయకత్వంలోని బీజేపీ శ్రేణులతో కలిసి నిరంతరం పనిచేస్తామని తెలిపారు.