Visakhapatnam District: సింహాచలం దేవస్థానంలోని ఇత్తడి కానుకలు మాయం చేసింది ఇంటి దొంగలే: పోలీసులు

  • 550 కిలోల ఇత్తడి కానుకలు మాయం
  • నాలుగు రోజుల్లోనే కేసును ఛేదించిన పోలీసులు
  • 8 మంది అరెస్ట్ 
Police arrested 8 accused in simhachalam brass gifts missing case

సింహాచలం అప్పన్న దేవస్థానంలో ఇత్తడి కానుకల మాయం కేసును పోలీసులు ఛేదించారు. ఇంటిదొంగలే ఈ పనికి పాల్పడినట్టు గుర్తించి నిందితులను అరెస్ట్ చేశారు. సింహాచలం దేవస్థానం కల్యాణ మండపంలో ఉంచిన దాదాపు 550 కిలోల ఇత్తడి కానుకలు మాయమైనట్టు ఇటీవల గుర్తించారు. దేవస్థానం ఏఈవో రామారావు ఈ నెల 10న ఇత్తడి కానుకల మాయంపై గోపాలపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

దర్యాప్తు చేపట్టిన పోలీసులు సింహాచలంలో నివసించే ఔట్ సోర్సింగ్ మాజీ ఉద్యోగి  కె. సురేశ్, సోమ సతీశ్‌లను అనుమానించి విచారించగా విషయం బయటపడింది. ఆలయ వ్యర్థాల్లో కలిపి ఇత్తడి కానుకలను బయటకు తరలించినట్టు అంగీకరించారు. కానుకలను విక్రయించిన, కొనుగోలు చేసిన మొత్తం 8 మందిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. నాలుగు రోజుల్లోనే కేసును ఛేదించిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.

More Telugu News