సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

15-10-2020 Thu 07:17
Thamanna free from Corona
  • కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న తమన్నా
  • తమిళంలోకి మహేశ్ బాబు హిట్ మూవీ  
  • రాజమౌళి 'ఆర్ఆర్ఆర్'కు భారీ ఆఫర్లు   

*  ఇటీవల కరోనా బారిన పడిన కథానాయిక తమన్నా ఇప్పుడు పూర్తిగా కోలుకుంది. ఆమధ్య షూటింగ్ కోసం హైదరాబాదుకు వచ్చిన తమన్నాకు కరోనా సోకడంతో, వైద్యుల పర్యవేక్షణలో క్వారంటైన్ లో వుంది. ఇప్పుడు పూర్తిగా తగ్గడంతో ముంబైకి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని తనే సోషల్ మీడియాలో వెల్లడించింది.  
*  మహేశ్ బాబు, రష్మిక జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతికి వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడీ చిత్రాన్ని తమిళంలోకి 'ఇవనుక్కు సరియాన అల్లయ్' పేరిట అనువదించారు. తమిళనాట థియేటర్లు తెరిచిన వెంటనే దీనిని విడుదల చేస్తారు.
*  రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రం బ్యాలెన్స్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది. కాగా, ఈ చిత్రానికి సంబంధించిన అన్ని భాషల డిజిటల్, శాటిలైట్ హక్కులు కలుపుకుని 200 కోట్లు పలికినట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందులో ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.