traffic: హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ను మళ్లిస్తోన్న పోలీసులు.. ఈ ప్రాంతాల మీదుగా వెళ్తే సేఫ్!

  • శంషాబాద్‌ విమానాశ్రయానికి ఓఆర్ఆర్‌పై నుంచే వెళ్లాలి
  • మెహిదీపట్నం నుంచి గచ్చిబౌలి వెళ్లేవారు సెవెన్‌ టూంబ్స్‌ నుంచి వెళ్లాలి
  • మలక్‌పేట్-ఎల్బీనగర్ మార్గం పూర్తిగా బ్లాక్  
  •  మూసారాం బాగ్ బ్రిడ్జి దగ్గర నిలిచిన ట్రాఫిక్  
traffic root changes in hyderabad

హైదరాబాద్ లో కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా రహదారులన్నీ జలమయమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాలు నత్తనడకన ముందుకు కదులుతున్నాయి. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు‌ ట్రాఫిక్‌ పోలీసులు చర్యలు చేపట్టారు. పలు మార్గాల్లో వాహనాల రాకపోకలను నిలిపేసిన పోలీసులు ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు.
 

  • హైదరాబాద్‌-కర్నూలు హైవే దెబ్బతింది. దీంతో శంషాబాద్‌ విమానాశ్రయానికి వెళ్లేవారందరూ ఓఆర్ఆర్‌పై నుంచే వెళ్లాలని చెప్పారు.
  • మెహిదీపట్నం నుంచి గచ్చిబౌలి వెళ్లేవారు టోలిచౌక్‌ ప్లైఓవర్ వాడకూడదని, సెవెన్‌ టూంబ్స్‌ నుంచి వెళ్లాలని తెలిపారు.
  • పురానాపూల్ 100 ఫీట్ల రోడ్డును పూర్తిగా మూసేసి, వాహనాలను కార్వాన్‌ మీదుగా మళ్లిస్తున్నారు. 
  • మరోవైపు మలక్‌పేట్ ఆర్‌యూబీ రోడ్ బ్లాక్ కావడంతో ఆ మార్గంలో వచ్చే వాహనాలను ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పంపుతున్నారు.  
  • మలక్‌పేట్ వద్ద నాలా పొంగడంతో మలక్‌పేట్-ఎల్బీనగర్ మార్గం పూర్తిగా బ్లాక్ అయ్యింది. 
  • మూసీ నది నుంచి బయటకు నీరు రావడంతో మూసారాం బాగ్ బ్రిడ్జి దగ్గర ట్రాఫిక్ నిలిచిపోయింది.

More Telugu News