vijay setupati: హీరో విజయ్ సేతుపతిపై మండిపడుతోన్న తమిళులు

tamilians slams vijay setupati

  • మురళీధరన్ జీవితకథ ఆధారంగా ‘800’ సినిమా 
  • చిత్రంలో విజయ్ సేతుపతి హీరో
  • శ్రీలంకలో తమిళులపై వివక్ష జరుగుతోందంటోన్న తమిళులు
  • #ShameOnVijaySethupathi హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్లు

శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవితకథ ఆధారంగా ‘800’ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆయన పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా మోషన్ పోస్టర్ ను సినిమా యూనిట్ విడుదల చేసింది. శ్రీలంక జెర్సీ ధరించి అచ్చం మురళీధరన్ ‌లా విజయ్ కనపడుతున్నాడు.

అయితే, ఈ పోస్టర్‌తో పాటు సినిమాపై తమిళులు మండిపడుతున్నారు.  శ్రీలంకలో తమిళులపై అక్కడి ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని, ఆ దేశ జాతీయ చిహ్నం ఉన్న జెర్సీతో విజయ్ నటిస్తున్నాడని వారు సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు చేస్తున్నారు. ఒక తమిళ వ్యక్తి అయ్యుండి,  శ్రీలంక జాతీయ చిహ్నం ఉన్న జెర్సీని ధరించడమేంటని నిలదీస్తున్నారు.  ట్విట్టర్‌లో #ShameOnVijaySethupathi హ్యాష్‌ట్యాగ్‌ పేరిట వారు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

  • Loading...

More Telugu News