కాబోయే భర్త పోస్ట్ చేసిన నిశ్చితార్థ ఫొటోపై హీరోయిన్ కాజల్ కామెంట్!

14-10-2020 Wed 13:15
kajal pic gors viral
  • బెలూన్ డిజైనింగ్ తో ఉన్న ఫొటో
  • డిజైన్ గొప్పదనాన్ని ఈ ఫొటో ప్రతిబింబిస్తోందన్న కాజల్
  • తనకు కాబోయే భర్తకి కళాత్మక హృదయం ఉందని వ్యాఖ్య

హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ నెల 30న ముంబైలో ఇంటీరియర్ డిజైనర్ గౌతమ్ కిచ్లూని వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. దగ్గరి బంధువులతో కలిసి ఈ వివాహ వేడుక నిరాడంబరంగా జరగనుంది. తనకు కాబోయే అత్తింటి వారితో ఆమె తీసుకున్న ఫొటోలు బయటకు వస్తున్నాయి. ఇటీవలే, తనకు కాబోయే భర్త, ఆడపడుచుతో కాజల్ తీసుకున్న ఫొటో ఒకటి వైరల్ అయింది.

ఈ సారి గౌతమ కిచ్లూ కాజల్‌తో దిగిన ఓ ఫొటోను పోస్ట్ చేశాడు.  నిశ్చితార్థం సందర్భంగా తీసిన ఆ ఫొటోను తన ఇంట్లో పెట్టుకుని, దానిని ఫొటో తీసి ఆయన పోస్ట్ చేశాడు. బెలూన్ డిజైనింగ్ తో ఉన్న ఆ ఫొటో చూడముచ్చటగా ఉంది. దీనిపై కాజల్ కూడా కామెంట్ చేసింది. డిజైన్ గొప్పదనాన్ని ఈ ఫొటో ప్రతిబింబిస్తోందని, తనకు కాబోయే భర్తకి కళాత్మక హృదయం ఉందని చెప్పింది.