తమిళ నటులు విజయకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు

14-10-2020 Wed 13:14
bomb threats at dhanush and vijayakanths residences in chennai
  • పోలీస్ కంట్రోల్ రూముకు రెండుసార్లు ఫోన్
  • పోలీసుల ఉరుకులు పరుగులు
  • ఫోన్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటులు ధనుష్, విజయకాంత్ ఇళ్లలో బాంబులు పెట్టినట్టు పోలీసులకు ఫోన్ రావడంతో ఉరుకులుపరుగులు పెట్టారు. నిన్న ఇద్దరు వ్యక్తులు పోలీస్ కంట్రోల్ రూముకు రెండుసార్లు ఫోన్ చేశారు. అభిరామపురంలోని ధనుష్, విరుగంబాక్కంలోని విజయకాంత్ ఇళ్లలో బాంబులు పెట్టినట్టు పేర్కొన్నారు.

దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్‌తో వారిళ్లకు చేరుకుని అణువణువు క్షుణ్ణంగా గాలించారు. బాంబు లేదని నిర్ధారించుకున్నాక ఊపిరి పీల్చుకున్నారు. పోలీస్ కంట్రోల్ రూముకు రెండుసార్లు ఫోన్ చేసిన వ్యక్తి ఒకరేనని ప్రాథమిక విచారణలో తేలినట్టు పోలీసులు తెలిపారు. దీంతో అతడిని అరెస్ట్ చేశారు. కాగా, గత కొద్ది కాలంగా తమిళనాడులో ఫేక్ బాంబు ఫోన్ కాల్స్ ఎక్కువయ్యాయి. రజనీకాంత్, విజయ్, అజిత్, సూర్య వంటి వారి ఇళ్లకు కూడా గతంలో ఫేక్ బాంబు కాల్స్ వచ్చాయి.