సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

14-10-2020 Wed 07:40
Samantha tells how lock down helped her
  • సమంతకు లాక్ డౌన్ హెల్ప్ చేసిందట 
  • ఓటీటీ ద్వారా అల్లరి నరేశ్ సినిమా
  • 'శాకుంతలం'కు బాలీవుడ్ హీరోయిన్?  

*  లాక్ డౌన్ కారణంగా తనకు ఎంతో ఖాళీ సమయం దొరికిందని చెబుతోంది కథానాయిక సమంత. ''అవును, ఇంతకు ముందు క్షణం తీరిక దొరికేది కాదు.. లాక్ డౌన్ వల్ల వృత్తి పరంగా ఖాళీ దొరికింది. మనుషుల మధ్య బంధాలు పెంచుకోవడానికి ఈ సమయం ఉపయోగపడింది. ఈ కష్టకాలంలో ఒకరికి ఒకరు సాయం చేసుకోవడం అన్నది నాలో ఎంతో స్ఫూర్తిని నింపింది" అని చెప్పింది సమంత  
*  అల్లరి నరేశ్ హీరోగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందుతున్న 'నాంది' చిత్రం షూటింగ్ మొత్తం పూర్తయింది. సతీశ్ వేగేశ్న నిర్మించిన ఈ చిత్రాన్ని థియేటర్లలో కాకుండా ఓటీటీ ద్వారా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ విషయంలో ప్రస్తుతం కొందరు ఓటీటీ ప్లేయర్స్ తో చర్చలు జరుగుతున్నాయట.
*  ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తన తదుపరి చిత్రంగా 'శాకుంతలం' చిత్రాన్ని చేస్తున్న సంగతి విదితమే. ఈ న్యూస్ వచ్చిన దగ్గర నుంచీ ఇందులో ఫలానా హీరోయిన్ నటిస్తుందంటూ రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం, ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి బాలీవుడ్ హీరోయిన్ కోసం గుణశేఖర్ ట్రై చేస్తున్నారట.