వరదలు, బురదలు అంత అసహ్యం కలిగిస్తున్నాయా?: సీఎం జగన్ పై లోకేశ్ విమర్శలు

13-10-2020 Tue 20:35
Lokesh questions CM Jagan over flood like situations in AP due to very heavy rains
  • వాయుగుండం ప్రభావంతో ఏపీలో వానలు
  • రాష్ట్రం గురించి పట్టించుకోరా అంటూ లోకేశ్ ట్వీట్
  • ఒక్కరోజైనా బాధితుల గోడు విన్నారా అంటూ ఆగ్రహం

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ లో స్పందించారు. భారీ వర్షాలు, వరదలు రాష్ట్రాన్ని ముంచెత్తుతున్నాయని తెలిపారు. పంటలు మునిగిపోయాయని, రోడ్లు చెరువులు అయ్యాయని వివరించారు.

ఢిల్లీ చుట్టూ తిరిగి జడ్జీలపై ఫిర్యాదులు చేయడం తప్ప ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు రాష్ట్రం గురించి పట్టదా? అని ప్రశ్నించారు. కనీసం ఒక్కరోజన్నా కాలు బయటపెట్టి బాధితుల గోడు విన్నారా? వరదలు, బురదలు అంత అసహ్యం కలిగిస్తున్నాయా? అని ప్రశ్నించారు.