గతంలో జరిగిన ఆ తప్పు మళ్లీ జరగకుండా మేం చూస్తున్నాం: మంత్రి అవంతి

13-10-2020 Tue 19:26
Jagan will never do any harm to Amaravathi says Avanthi Srinivas
  • గతంలో అభివృద్ది మొత్తం హైదరాబాదులోనే జరిగింది
  • రాష్ట్రం విడిపోవడానికి ఇదొక ప్రధాన కారణం
  • మేము మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం

గతంలో అభివృద్ది మొత్తం హైదరాబాదుకు మాత్రమే పరిమితమైందని... రాష్ట్రం విడిపోవడానికి అదే ప్రధాన కారణమని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. గతంలో జరిగిన ఈ తప్పు మళ్లీ జరగకుండా తాము చూస్తున్నామని చెప్పారు.

అమరావతితో పాటు విశాఖపట్నం, కర్నూలును  కూడా అభివృద్ధి చేస్తామని తెలిపారు. అమరావతికి నష్టం కలిగించే ఏ ఒక్క పని ముఖ్యమంత్రి జగన్ చేయరని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం అమరావతి అభివృద్ధినే కోరుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు ప్రయత్నాలకు కొందరు వత్తాసు పలుకుతున్నారని దుయ్యబట్టారు. ఏపీకి ప్రత్యేకహోదా కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు.