MS Dhoni: ఐపీఎల్ లో నేడు చెన్నై వర్సెస్ హైదరాబాద్... టాస్ గెలిచిన ధోనీ

Chennai Super Kings skipper MS Dhoni wins the toss against Sunrisers Hyderabad
  • బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ సారథి
  • చెన్నై జట్టులోకి చావ్లా పునరాగమనం
  • అభిషేక్ శర్మ స్థానంలో నదీమ్ ను తీసుకున్న సన్ రైజర్స్
ఐపీఎల్ లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో నేడు సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ పోరులో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

టాస్ గెలిచిన సందర్భంగా ధోనీ మాట్లాడుతూ, మొదట బ్యాటింగ్ చేయాలని గత కొన్ని మ్యాచ్ లుగా అనుకుంటున్నప్పటికీ అవకాశం రాలేదని, ఇప్పుడు టాస్ గెలవడంతో మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ తీసుకున్నానని వెల్లడించాడు.

ఈసారి టోర్నీలో ఏ మ్యాచ్ కు ఆ మ్యాచ్ లో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని తెలిపాడు. ఈ మ్యాచ్ కోసం జగదీశన్ స్థానంలో పియూష్ చావ్లాను తీసుకున్నామని, లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ ను ఆడించే విషయం ఆలోచించామని, అయితే జట్టు కూర్పు అందుకు వీలు కల్పించడం లేదని వివరించాడు.

ఇక, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ మ్యాచ్ కోసం ఒక మార్పు చేసింది. అభిషేక్ శర్మ స్థానంలో షాబాజ్ నదీమ్ ను తుదిజట్టుకు ఎంపిక చేసింది.
MS Dhoni
Toss
Chennai Super Kings
Sunrisers Hyderabad
IPL 2020

More Telugu News