ఏపీ కరోనా అప్ డేట్: 4,622 పాజిటివ్ కేసులు, 35 మరణాలు

13-10-2020 Tue 18:23
AP sees gradual decline in Corona positive cases
  • గత 24 గంటల్లో 72,082 కరోనా టెస్టులు
  • పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా 752 కేసులు
  • అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 88 కేసులు
  • తాజాగా 5,715 మందికి కరోనా నయం

ఏపీలో కరోనా పరిస్థితులపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్ విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో 72,082 శాంపిళ్లు పరీక్షించగా, 4,622 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా, పశ్చిమ గోదావరి జిల్లాలో 752 కేసులు రాగా, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 88 కేసులు వచ్చాయి.

అదే సమయంలో రాష్ట్రంలో 35 మంది కరోనాతో మృతి చెందారు. ఒక్క చిత్తూరు జిల్లాలోనే ఏడుగురు మరణించారు. మొత్తమ్మీద ఏపీలో ఇప్పటివరకు 6,291 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. తాజాగా 5,715 మందికి కరోనా నయం అయింది. ఏపీలో నేటి వరకు 7,63,573 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 7,14,427 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 42,855 మంది చికిత్స పొందుతున్నారు.