అఖిల్ సినిమా నుంచి పూజ హెగ్డే లుక్ విడుదల

13-10-2020 Tue 17:08
Pooja Hegde look from Akhil film released
  • ఈ రోజు కథానాయిక పూజ హెగ్డే బర్త్ డే 
  • 'రాధే శ్యామ్' నుంచి ఇప్పటికే వచ్చిన లుక్
  • తాజాగా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' నుంచి
  • ఇటలీలో షూటింగులో వున్న పూజ  

హీరో హీరోయిన్ల బర్త్ డేలకు వారు నటిస్తున్న చిత్రాలలోని కొత్త లుక్స్  ను కానీ, టీజర్ ను కానీ విడుదల చేస్తూ ఆయా చిత్రాల దర్శక నిర్మాతలు విషెస్ చెబుతూ వుంటారు. ఈ రోజు అందాల కథానాయిక పూజ హెగ్డే జన్మదినం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఇప్పటికే 'రాధే శ్యామ్' చిత్రం యూనిట్ ఆమెకు విషెస్ చెబుతూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది.

ఈ క్రమంలో ఆమె అఖిల్ సరసన నటిస్తున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' చిత్రం నుంచి కూడా కాసేపటి క్రితం సర్ ప్రైజ్ గిఫ్ట్ వచ్చింది. ఆమె సోలో స్టిల్ ను పోస్టర్ గా డిజైన్ చేసి, ఆమెకు బర్త్ డే విషెస్ చెబుతూ విడుదల చేశారు. అందంగా.. స్టయిలిష్ గా వున్న పూజ కాలేజీకి వెళుతున్నట్టుగా ఈ పోస్టర్ లో కనిపిస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

ఇదిలావుంచితే, తన బర్త్ డే రోజున పూజ హెగ్డే ఇటలీలో వుంది. ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'రాధే శ్యామ్' చిత్రం షూటింగ్ కోసం ప్రస్తుతం ఈ చిన్నది ఇటలీలో వుంది. గత కొన్ని రోజులుగా అక్కడ ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది.