Brahmotsavam: దసరా బ్రహ్మోత్సవాలు కూడా ఏకాంతంగానే... టీటీడీ నిర్ణయం

TTD decides to celebrate Brahmotsavam without devotees
  • ఈ నెల 16 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
  • తొలుత భక్తులను అనుమతించాలని భావించిన టీటీడీ
  • కేంద్రం, రాష్ట్ర సర్కారు మార్గదర్శకాలతో తాజా నిర్ణయం
ఈ నెల 16 నుంచి తిరుమల శ్రీవారి దసరా బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా జారీ చేసిన కరోనా మార్గదర్శకాల నేపథ్యంలో ఈసారి కూడా బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు నిర్ణయించింది.

ఇటీవల ముగిసిన సాలకట్ల బ్రహ్మోత్సవాలను కూడా ఏకాంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. అధికమాసం కారణంగా ఈ ఏడాది రెండు పర్యాయాలు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. తాజాగా దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 16 నుంచి 24 వరకు నిర్వహించనున్నారు.

అయితే, భక్తులను అనుమతించాలని తొలుత నిర్ణయించినా, కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. భక్తుల నడుమ స్వామివారి దసరా బ్రహ్మోత్సవాలు జరిపేందుకు ఏర్పాట్లు కూడా చేసినా, భక్తుల ఆరోగ్యరీత్యా ఏకాంతంగానే ఉత్సవాలు జరిపేందుకు సిద్ధమవుతున్నారు.
Brahmotsavam
TTD
Devotees
Tirumala
Corona Virus

More Telugu News