అసెంబ్లీ సమావేశాలకు కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేల గైర్హాజరు!

13-10-2020 Tue 12:21
Congress and BJP MLAs not attended TS Assembly sessions
  • టీఎస్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం
  • జీహెచ్ఎంసీ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన కేటీఆర్
  • కాంగ్రెస్ నుంచి భట్టి విక్రమార్క, సీతక్క మాత్రమే హాజరు

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు కాసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. కొన్ని చట్టాల సవరణ కోసం ఈ సమావేశాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. జీహెచ్ఎంసీ చట్టాల్లో కొన్ని, హైకోర్టు సూచించిన అంశాల్లో కొన్ని చట్టాలు చేయనున్నారు. కాసేపటి క్రితమే శాసనసభలో మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ద్వారా 5 సవరణలు చేస్తున్నామని చెప్పారు.

మరోవైపు ఈ సమావేశాలకు బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు చాలామంది గైర్హాజరయ్యారు బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ తో పాటు... కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు తదితర కాంగ్రెస్ కీలక నేతలు గైర్హాజరయ్యారు. సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, ఎమ్మెల్యే సీతక్క మాత్రం హాజరయ్యారు. అధికార టీఆర్ఎస్, ఎంఐఎం సభ్యులు మాత్రం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.