నాని సినిమాలో హీరోయిన్ మారుతోందట!

12-10-2020 Mon 17:52
Heroine is changed for Nani flick
  • ప్రస్తుతం రెండు సినిమాలలో అనుపమ 
  • నాని హీరోగా 'శ్యామ్ సింగ రాయ్'
  • సాయిపల్లవికి డేట్స్ సర్దుబాటు సమస్య
  • వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్  

మల్లూ బేబీ అనుపమ పరమేశ్వరన్ తెలుగులో నిఖిల్ సరసన ప్రస్తుతం రెండు సినిమాలలో నటించే అవకాశాన్ని పొందినట్టుగా ఇటీవల వార్తలొచ్చాయి. వీటిలో ఒకటి 'కార్తికేయ' సీక్వెల్ కాగా, మరొకటి '18 పేజెస్' చిత్రం. ఇప్పుడీ భామకు తాజాగా మరో మంచి అవకాశం కూడా వచ్చినట్టు తెలుస్తోంది. నాని సరసన కథానాయికగా నటించే ఛాన్స్ ను ఈ ముద్దుగుమ్మ పొందినట్టు చెబుతున్నారు.

ప్రస్తుతం 'టక్ జగదీశ్' సినిమాలో నటిస్తున్న నాని ఆ తర్వాత 'శ్యామ్ సింగ రాయ్' పేరిట రూపొందే చిత్రంలో నటిస్తాడు. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ఇది రూపొందుతుంది. ఇందులో మొదటగా సాయిపల్లవిని హీరోయిన్ గా తీసుకున్నట్టు వార్తలొచ్చాయి. అయితే, లాక్ డౌన్ కారణంగా డేట్స్ అన్నీ అప్సెట్ కావడంతో ఆమె ఈ చిత్రానికి డేట్స్ సర్దుబాటు చేయలేకపోతోందట. దాంతో ఆమె స్థానంలో అనుపమను తీసుకున్నట్టు సమాచారం.

సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మించే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావచ్చాయి. వచ్చే నెల నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగును నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు.