Jagan: మీటర్లు బిగించే క్రమంలో రైతులపై ఒక్క రూపాయి కూడా భారం పడదు: సీఎం జగన్

  • ఉచిత్ విద్యుత్ పథకంపై సీఎం జగన్ సమీక్ష
  • రైతుల్లో అవగాహన కల్పించాలని సూచన
  • నాణ్యమైన విద్యుత్ అందించేందుకు వీలవుతుందని వెల్లడి
CM Jagan reviews YSR Free Current in state

ఏపీ సీఎం జగన్ విద్యుత్ శాఖ, వైఎస్సార్ ఉచిత విద్యుత్ పథకంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని ఆదేశించారు. మోటార్లకు మీటర్లు బిగించే క్రమంలో రైతులపై ఒక్క రూపాయి కూడా భారం పడదని స్పష్టం చేశారు. ఈ విషయంలో రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.

ఉచిత విద్యుత్ పథకంలో భాగంగా ఇకపై విద్యుత్ బిల్లులు నేరుగా రైతుల ఖాతాల్లోనే జమచేస్తామని చెప్పారు. రైతులు అదే నగదును విద్యుత్ బిల్లుల కింద డిస్కంలకు చెల్లిస్తారని వివరించారు. ఈ విధానం ద్వారా వ్యవసాయ రంగానికి నాణ్యమైన విద్యుత్ ను అందించే వీలుందని అన్నారు. మీటర్ల సేకరణ, ఏర్పాటులో నాణ్యతకే పెద్దపీట వేస్తున్నామని తెలిపారు.

More Telugu News