జయలలిత గెటప్ లో హీరోయిన్ కంగన.. కొత్త ఫోటోలు వైరల్

12-10-2020 Mon 12:07
kangana pics go viral
  • తలైవి సినిమాలో నటిస్తోన్న కంగన
  • జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ షూటింగ్
  • సంప్రదాయబద్ధమైన లుక్ లో కంగన

కరోనా వ్యాప్తి కారణంగా విధించిన లాక్ డౌన్ లో సడలింపులు ఇవ్వడంతో సినీ ప్రముఖులు షూటింగుల్లో పాల్గొంటున్నారు. హీరోయిన్ కంగనా ర‌నౌత్ ఆరు నెల‌ల త‌ర్వాత షూటింగ్ ‌లో ఇటీవల పాల్గొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె తమిళనాడు మాజీ సీఎం దివంగత జయ‌ల‌లిత జీవిత కథ ఆధారంగా తీస్తోన్న తలైవి సినిమాలో నటిస్తోంది.
          
ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ఆ సినిమా యూనిట్ షూటింగు పనులు కొనసాగిస్తోంది. ఈ సినిమా షూటింగులో తీసుకున్న కొన్ని ఫొటోలను ఆమె ఇటీవల తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. తాజాగా, మరిన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది. జయలలితలా చీర కట్టుకొని, నుదుటిన బొట్టు పెట్టుకుని సంప్రదాయబద్ధంగా ఆమె కనపడుతోంది.

హైదరాబాద్‌లో ఇటీవల షెడ్యూల్‌ పూర్తి చేసుకుని తన స్వస్థలం మనాలికి ఆమె తిరిగివెళ్లారు. కొవిడ్ వ్యాప్తి అనంతరం చాలా విషయాలు మారాయని, యాక్షన్‌, కట్‌ మాత్రం మారలేదని చెబుతూ ఆమె ఈ ఫొటోలు షేర్ చేసింది. జయమ్మ ఆశీర్వాదంతో ఈ సినిమా మరో షెడ్యూల్‌ పూర్తిచేసుకుందని చెప్పింది.