Jagan: జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ రేపటికి వాయిదా

court adjourns jagan case trial
షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్ లోని సీబీఐ, ఈడీ కోర్టుల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ రేపటికి వాయిదా పడింది. కాగా, గత శుక్రవారం ఈ కేసును పరిశీలించిన న్యాయస్థానం నేటికి వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కోర్టులో విచారణ జరిగింది.

అలాగే, హైకోర్టులో స్టే ఉన్న మరికొన్ని కేసుల్లో విచారణను వచ్చేనెల 9న కోర్టు చేపట్టనుంది. ఈ కేసుల్లో విచారణను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరపాలని ఏపీ సీఎం జగన్ తరఫు న్యాయవాదులు ఇప్పటికే కోర్టును కోరారు. అయితే, దీనిపై న్యాయస్థానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
Go Back to Shorts
Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News