Vijay Sai Reddy: ‘ఇంకో పాతికేళ్లు ఏడుస్తూనే ఉండండి’ అంటూ విజయసాయిరెడ్డి విమర్శలు.. బుద్ధా వెంకన్న కౌంటర్

  • జగనన్న విద్యాకానుకపై విమర్శలు చేస్తున్నారన్న విజయసాయిరెడ్డి
  • చిల్లర మాటలు మాట్లాడుతున్నారని విమర్శ
  • బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని ఎత్తేశారన్న బుద్ధా వెంకన్న
  • 25 ఏళ్లు జైలు జీవితం ఖాయమే అంటూ ఎద్దేవా
vijaya sai slams tdp leaders

ఆంధ్రప్రదేశ్ లో ‘జగనన్న విద్యాకానుక’ పేరిట పాఠశాల విద్యార్థులకు అందజేస్తోన్న కిట్లపై టీడీపీ నేతలు చేస్తోన్న విమర్శల పట్ల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ‘జగనన్న విద్యాకానుక పేరుతో పేదలపై ఉన్న కడుపుమంటను కక్కేస్తున్నారు పచ్చనేతలు. పార్టీ రంగులున్నాయని కొందరు, టీడీపీ కూడా ఇచ్చిందని మరికొందరు. హై క్వాలిటీ కిట్ లను అందించడంతో ఇక చేసేదిలేక చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. ఇంకో పాతికేళ్లు ఈ ఏడుపు ఏడుస్తూనే ఉండండి’ అని విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.

విజయసాయిరెడ్డి చేసిన విమర్శల పట్ల టీడీపీ నేత బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. దోచిన 43 వేల కోట్లు ఇచ్చి వైఎస్ జగన్ మావయ్య అయ్యాడా విజయసాయిరెడ్డి? దొంగ మామ ఇచ్చిన బ్యాగ్ స్కూల్ తెరవకముందే చిరిగిపోయింది అని పిల్లలు కంప్లైంట్ చేస్తున్నారు. టీడీపీ హయాంలో ఉన్న సైకిళ్ల పంపిణీ ఎత్తేశావ్,పేద విద్యార్థులకు వరంలా ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని ఎత్తేశారు’ అని బుద్ధా వెంకన్న చెప్పారు.

‘పిల్లలు పెట్టుకునే బెల్టుకి పార్టీ రంగులు వేసుకునే చిల్లర బ్యాచ్ మీరు.17 నెలలకే నీ అల్లుడు హ్యాండ్స్ అప్. 25 ఏళ్లు జైలు జీవితం ఖాయమే సాయి రెడ్డి’ అని బుద్ధా వెంకన్న ట్వీట్లు చేశారు.

More Telugu News