Virat Kohli: విరాట్ కోహ్లీ ధమాకా ఇన్నింగ్స్... బెంగళూరు 169/4

Kohli blasts ninety runs as RCB posted reasonable score
  • 52 బంతుల్లో 90 రన్స్ చేసిన కోహ్లీ
  • 33 పరుగులతో రాణించిన పడిక్కల్
  • నిరాశపరిచిన ఫించ్, డివిల్లీర్స్
కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ రుచిచూపించడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గౌరవప్రదమైన స్కోరు సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 169 పరుగులు చేసింది. కోహ్లీ 52 బంతుల్లో 90 పరుగులతో అజేయంగా నిలిచాడు. కోహ్లీ స్కోరులో 4 ఫోర్లు, 4 సిక్సులున్నాయి. ఈ మ్యాచ్ ద్వారా కోహ్లీ ఐపీఎల్ లో ఆర్సీబీ తరఫున 6 వేల పరుగుల మైలురాయి అందుకున్నాడు. ఓపెనర్ దేవదత్ పడిక్కల్ 33 పరుగులు సాధించాడు.

ఓపెనర్ ఆరోన్ ఫించ్ (2), స్టార్ బ్యాట్స్ మన్ ఏబీ డివిల్లీర్స్ (0) విఫలం కావడంతో కొద్దిగా ఇబ్బంది పడిన బెంగళూరు జట్టు కెప్టెన్ కోహ్లీ రాణించడంతో కోలుకుంది. చివర్లో శివమ్ దూబే 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ తో 22 పరుగులు నమోదు చేశాడు. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 2 వికెట్లు తీశాడు. దీపక్ చహర్ 1, శామ్ కరన్ 1 వికెట్ సాధించారు.
Virat Kohli
RCB
CSK
Devdatt Padikkal
IPL 2020

More Telugu News