'దిశ' సినిమాను ఆపాలనే పిటిషన్ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ స్పందన

10-10-2020 Sat 16:57
Ram Gopal Varma reacts on Disha Encounter film
  • 'దిశ' ఘటన ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్న వర్మ
  • సినిమాను ఆపాలంటూ కోర్టులో పిటిషన్ వేసిన దిశ తండ్రి
  • తనది ఒక ఊహాజనిత కథ అని చెప్పిన వర్మ

యథార్థ ఘటనలను సినిమాలుగా మలచడంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముందుంటాడు. రోజుల వ్యవధిలోనే సినిమాను తెరకెక్కించి, ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో వర్మ దిట్ట. తాజాగా హైదరాబాద్ శివార్లలో జరిగిన 'దిశ' ఘటనపై వర్మ సినిమా తీస్తున్నాడు. అయితే, 'దిశ ఎన్ కౌంటర్' పేరుతో తెరకెక్కుతున్న ఈ  సినిమాపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాను ఆపేలా కేంద్ర ప్రభుత్వం, సెన్సార్ బోర్డును ఆదేశించాలంటూ తెలంగాణ హైకోర్టును దిశ తండ్రి ఆశ్రయించారు.

ఈ నేపథ్యంలో వర్మ ట్విట్టర్ ద్వారా స్పందించారు. 'దిశ' సినిమాపై అనేక ఊహాగానాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తాను ఒక విషయాన్ని స్పష్టం చేయదలుచుకున్నానని... నిర్భయ రేప్ తర్వాత జరిగిన అనేక కేసుల ఆధారంగా ఒక ఊహాజనిత కథను తాను సినిమాగా తీస్తున్నానని వర్మ ట్వీట్ చేశాడు.