బిగ్ బాస్ లో మోనాల్‌తో అఖిల్‌ లవ్‌.. అఖిల్ తల్లిదండ్రుల స్పందన ఏమిటంటే..?

10-10-2020 Sat 14:51
Big Boss contestant Akhil parents reaction on his love with Monal
  • అఖిల్ లవ్ పై తల్లిదండ్రుల ఆగ్రహం
  • తెలంగాణ అమ్మాయితో పెళ్లి చేస్తామని వ్యాఖ్య
  • ఇప్పటికే అమ్మాయిని చూస్తున్నామన్న అఖిల్ పేరెంట్స్

తెలుగు బిగ్ బాస్ లో కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ దొరుకుతోంది. వివిధ రకాల టాస్కులు ప్రేక్షకులను అకట్టుకుంటున్నాయి. వీటికి తోడు లవ్ స్టోరీలు కూడా చర్చనీయాంశంగా మారాయి. సినీ నటి మోనాల్ తో ఇద్దరు కంటెస్టెంట్ లు అఖిల్, అభిజిత్ లు చాలా క్లోజ్ గా ఉంటున్నారు. ఆమె కూడా ఇద్దరితో క్లోజ్ గా వ్యవహరిస్తోంది. అభిజిత్ మరోవైపు హారికతో కూడా క్లోజ్ గా ఉంటుండగా... అఖిల్ మాత్రం మోనాల్ కే ఫిక్స్ అయ్యాడు.

వీటన్నింటి నేపథ్యంలో... అఖిల్ తల్లిదండ్రులు దీనిపై స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో అఖిల్ తల్లిద్రండ్రులు మాట్లాడుతూ, మోనాల్ తో తమ కుమారుడు క్లోజ్ గా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బిగ్ బాస్ హౌస్ నుంచి అఖిల్ రాగానే... ఒక అందమైన తెలంగాణ అమ్మాయితో పెళ్లి చేసేస్తామని అఖిల్ తల్లి చెప్పారు. ఇప్పటికే అఖిల్ కు సంబంధాలు చూస్తున్నామని వెల్లడించారు. దీంతో, మోనాల్ ని అఖిల్ మనస్పూర్తిగా ఇష్టపడినా... వారి పెళ్లి చేసేందుకు అఖిల్ తల్లిదండ్రులు ఒప్పుకోకపోవచ్చనే విషయం అర్థమవుతోంది. ఈ క్రమంలో, బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వీరి ప్రేమాయణం ఎలాంటి మలుపులు తిరుగుతుందో అనే ఆసక్తి నెలకొంది.