Devineni Uma: ఏడాదిలో లక్ష కోట్లు అప్పు చేసిన విజన్ మీకే సొంతం దొంగలెక్కల విజయసాయిరెడ్డి: దేవినేని ఉమ

Devineni gives a fitting reply to YCP MP Vijayasai Reddy
  • పోలవరం యాత్రలకు చంద్రబాబు దుబారా చేశాడన్న విజయసాయి
  • చంద్రబాబు పోలవరం 70 శాతం పూర్తిచేశాడన్న ఉమ
  • జగన్ నిర్మించింది 0.6 శాతమేనని వెల్లడి
సోషల్ మీడియాలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేస్తున్న విమర్శనాత్మక ట్వీట్లకు టీడీపీ నేతలు ఘాటుగా బదులిస్తున్నారు. పోలవరం యాత్రలకు చంద్రబాబు రూ.400 కోట్లు ఖర్చు చేస్తే, 43 లక్షల మంది విద్యార్థులకు కిట్లు ఇచ్చేందుకు జగన్ రూ.650 కోట్లు ఖర్చు చేశారని, ఏది విజన్? ఏది దుబారా? అని విజయసాయి ట్వీట్ చేశారు. దీనిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ స్పందించారు.

చంద్రబాబు పోలవరం 70 శాతం పూర్తిచేశారని వెల్లడించారు. కానీ 17 నెలల్లో జగన్ నిర్మించింది 0.6 శాతమే.... మీరా పోలవరం గురించి మాట్లాడేది? అని ఉమ విమర్శించారు. ఇలాంటి గోబెల్స్ ప్రచారాలు చేయడంపై పెట్టే శ్రద్ధ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాబట్టడంపై పెట్టాలని హితవు పలికారు. 'ఏడాదిలో లక్ష కోట్లు అప్పు చేసిన విజన్ మీకే సొంతం దొంగలెక్కల విజయసాయిరెడ్డి!' అంటూ ఉమ ట్వీట్ చేశారు.
Devineni Uma
Vijay Sai Reddy
Polavaram Project
Jagan
Chandrababu

More Telugu News