Budda Venkanna: ఏపీకి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలన్న విజయసాయి.. అబద్ధపు ట్వీట్లు చేస్తావా? అంటూ బుద్ధా వెంకన్న కౌంటర్!

Budda Venkanna once again take a dig at Vijayasai Reddy
  • కరోనా కట్టడిలో ఏపీకి ప్రశంసలు దక్కాయన్న విజయసాయి
  • బాబు ధైర్యంగా రాష్ట్రానికి వచ్చాడని వ్యంగ్యం
  • సిగ్గు లేకుండా ట్వీట్లు చేస్తావా అంటూ బుద్ధా విసుర్లు
  • ఎక్కువమందిని చంపారని ప్రశంసించారా అంటూ ఎద్దేవా
కరోనా కట్టడిలో ఏపీకి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభించాయని, రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతుండడంతో బాబు ధైర్యంగా రాష్ట్రానికి వచ్చేశాడని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఘాటుగా స్పందించారు. కరోనా రాగానే అల్లుడి బాత్రూం వైద్యం గుర్తొచ్చి హైదరాబాద్ చెక్కేసిన నువ్వు కరోనా గురించి మాట్లాడుతున్నావా? అని సెటైర్ వేశారు.

అల్లుడి బ్లీచింగ్ చల్లుడు, పారాసెటిమాల్ వైద్యానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయా? మాస్కు వేసుకోకుండా స్వైర విహారం చేసి ప్రజలకు కరోనా అంటించిన నీవు సిగ్గులేకుండా అబద్ధపు ట్వీట్లు చేస్తావా? అని ప్రశ్నించారు.

ఎక్కువ కేసులు ఉన్నాయని, ఎక్కువ మందిని చంపేశారని ప్రపంచవ్యాప్త గుర్తింపు వచ్చిందా? అని బుద్ధా ఎద్దేవా చేశారు. వరద వస్తే నవ్వుతూ హెలికాప్టర్ లో వెళ్లి తాడేపల్లి ఇంట్లో నక్కిన జగన్ కరోనాకి భయపడ్డాడా? కేసులకు భయపడ్డాడా? అని నిలదీశారు.
Budda Venkanna
Vijay Sai Reddy
Corona Virus
Jagan
Chandrababu
Andhra Pradesh

More Telugu News