Sreemukhi: 'మహాతల్లి' జాహ్నవితో కలిసి యాంకర్ శ్రీముఖి డ్యాన్స్.. వీడియో వైరల్

Anchor Sreemukhi Mahathalli fame Jahnavi dances together wins hearts
  • యూట్యూబ్ లో  ‘ఓహ్.. విమెనియా’ పేరుతో శ్రీముఖి టాక్ షో 
  • నాలుగో ఎపిసోడ్ లో ఈ షోకు జాహ్నవి  
  • భరత నాట్యం మొదలు కొని అన్ని రకాల డ్యాన్సులు ఒకేసారి
యూట్యూబ్ స్టార్ ‘మహాతల్లి’ జాహ్నవితో కలిసి యాంకర్ శ్రీముఖి విచిత్రంగా డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఇటీవల శ్రీముఖి తన యూట్యూబ్ లో  ‘ఓహ్.. విమెనియా’ పేరుతో ఓ టాక్ షో ప్రారంభించింది. నాలుగో ఎపిసోడ్ లో ఈ షోకు జాహ్నవి వచ్చింది. ఈ నేపథ్యంలో వారిద్దరు కలసి డ్యాన్స్ చేశారు. భరత నాట్యం మొదలు కొని వారు అన్ని రకాల డ్యాన్సులు ఒకేసారి చేయడం ప్రేక్షకులను అలరిస్తోంది.

ఇందుకు సంబంధించిన వీడియోను శ్రీముఖి తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. యాంకర్ గా, నటిగా శ్రీముఖి మంచి పేరు తెచ్చుకుంది. తన యూట్యూబ్ ఛానెల్ లో ప్రోగ్రాములు చేయడం కూడా ప్రారంభించింది. కాగా, యూట్యూబ్ లో మహాతల్లి పేరిట జాహ్నవి అందరికీ పరిచయమే. ఆమె పలు సినిమాల్లోనూ నటించింది.
   


        


Sreemukhi
Viral Videos
Tollywood
youtube

More Telugu News