Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్ తో కలిసి నటిస్తుండడంపై ప్రభాస్ స్పందన!

Amitabh Bachchan An honour and a privilege to be a part of this momentous
  • వైజయంతీ మూవీస్ బ్యానర్ పై కొత్త సినిమా 
  • బిగ్ బీతో నటిస్తుండడంతో తన కల నిజం కాబోతోందన్న ప్రభాస్
  • ఈ సినిమాలో నటిస్తున్నందుకు గర్వంగా భావిస్తున్నానన్న బిగ్ బీ
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్  హీరోగా వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మించనున్న సినిమాలో అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నట్లు ఆ సినిమా యూనిట్ నేడు ప్రకటించిన విషయం తెలిసిందే.

 అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ   సైన్స్ ఫిక్షన్‌ సినిమాలో బిగ్ బీతో నటిస్తున్నందుకు ప్రభాస్ హర్షం వ్యక్తం చేశాడు. ఎట్టకేలకు తన కల నిజం కాబోతోందని, దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్‌తో కలిసి తాను నటించబోతున్నానని ప్రభాస్ పోస్ట్ చేశాడు.

కాగా, ఈ సినిమాలో నటిస్తున్నందుకు అమితాబ్ బచ్చన్ కూడా స్పందించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో నటిస్తున్నందుకు గాను తాను గర్వంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. వైజయంతి మూవీస్ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు. మరో 50 ఏళ్లపాటు వారి సేవలు అందాలని ఆకాంక్షించారు.
Amitabh Bachchan
Prabhas
Tollywood
Bollywood

More Telugu News