Prabhas: ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా నుంచి రేపు బిగ్ అనౌన్స్ మెంట్!

Big Announcement from Prabhas flick tomorrow
  • ప్రభాస్ తో వైజయంతీ మూవీస్ భారీ చిత్రం 
  • హీరోయిన్ గా బాలీవుడ్ భామ దీపిక పదుకొనే
  • విలన్ పాత్రధారి పేరును ప్రకటించే అవకాశం  
ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న మూడు చిత్రాలూ భారీ చిత్రాలే.. మూడూ పాన్ ఇండియా స్థాయిలో నిర్మాణం అవుతున్న చిత్రాలే. వీటిలో ఒకటి 'రాధే శ్యామ్' గత కొన్నాళ్లుగా షూటింగు దశలో వుంది. మిగతా రెండు చిత్రాలలో ఒకటి నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్నది కాగా, మరొకటి డైరెక్టు హిందీ చిత్రం 'ఆదిపురుష్'.

వీటిలో 'రాధే శ్యామ్' తర్వాత మొదలయ్యేది నాగ్ అశ్విన్ చిత్రం. అంతర్జాతీయ స్థాయి ఉన్నత సాంకేతిక విలువలతో రూపొందే ఈ చిత్రంలో బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపిక పదుకొనే కథానాయికగా నటిస్తోంది. హాలీవుడ్ సాంకేతిక నిపుణులు కొందరు ఈ చిత్రానికి పనిచేస్తారంటూ కూడా వార్తలొచ్చాయి.

ఇక ఈ చిత్రానికి సంబంధించిన మరో బిగ్ అనౌన్స్ మెంట్ రేపు రానుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ కాసేపటి క్రితం సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. 'రేపు ఉదయం 10 గంటలకు బిగ్ అనౌన్స్ మెంట్ వుంది..' అంటూ వైజయంతీ మూవీస్ ట్వీట్ చేసింది.

దీంతో ఆ విశేషం ఏమిటా? అంటూ ప్రభాస్ అభిమానూలు కుతూహలంగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో ఓ ప్రముఖ హీరో విలన్ పాత్ర పోషించే అవకాశం ఉందంటూ ఇటీవల ప్రచారం జరిగింది. బహుశ దాని గురించిన ప్రకటనే అయివుంటుందని చాలామంది ఊహిస్తున్నారు.  
Prabhas
Nag Ashvin
Deepika Padukone

More Telugu News