Jagapathi Babu: చంపేస్తామంటూ జగపతిబాబు సోదరుడికి బెదిరింపులు!

Jagapathi Babus brother receives threat calls
  • గుట్టల బేగంపేట స్థలం విషయంలో బెదిరింపులు
  • దీని వెనుక రాజిరెడ్డి అనే వ్యక్తి ఉన్నట్టు అనుమానాలు
  • బంజారాహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేసిన జగపతిబాబు సోదరుడు
ప్రముఖ సినీ నటుడు జగపతిబాబు సోదరుడు యుగేంద్రకుమార్ కు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. చంపేస్తామని కాల్ చేసి బెదిరించారు. దీనికి సంబంధించి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో యుగేంద్రకుమార్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు మొత్తం 25 ఫోన్ కాల్స్ వచ్చినట్టు చెపుతున్నారు. యుగేందర్ తో పాటు అతని కుమారుడిని కూడా చంపేస్తామని శ్రీనివాస్ అనే వ్యక్తి బెదిరించాడని సమాచారం. గుట్టల బేగంపేటలోని స్థలం విషయంలో ఈ బెదిరింపులు వచ్చాయి. దీని వెనుక బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీకి చెందిన రాజిరెడ్డి అనే వ్యక్తి ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Jagapathi Babu
Tollywood
Brother
Threat calls

More Telugu News