Chiranjeevi: 1990లో సుస్మిత, 2020లో సంహిత... పరంపర అలా కొనసాగుతోంది: చిరంజీవి

Chiranjeevi shares his grand daughter acting video
  • రుద్రమ వేషం వేసిన చిరు మనవరాలు సంహిత
  • నాడు సుస్మిత కూడా ఇదే వేషం వేసిందన్న మెగాస్టార్
  • పిల్లల అభిరుచిని తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచన
మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో మరో ఆసక్తికర పోస్టు చేశారు. నాడు 1990లో తన కుమార్తె సుస్మిత రాణి రుద్రమ వేషం వేయగా, ఇప్పుడు ఆమె కుమార్తె సంహిత అదే వేషంలో అలరించిన వైనాన్ని చిరు సామాజిక వేదికలపై పంచుకున్నారు. 1990లో సుస్మిత, 2020లో సంహిత... పరంపర కొనసాగుతోంది అంటూ స్పందించారు.

ఈ మేరకు తన మనవరాలు సంహిత రాణి రుద్రమదేవి వేషంలో అభినయించిన వీడియోను ఆయన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. చిన్నారి సంహిత యాక్టింగ్ చూసి చిరు ఎంతో మురిసిపోయారు. చిన్నారుల అభిరుచిని తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే అది వారిలో ఉత్సాహాన్ని నింపుతుంది అని పేర్కొన్నారు.

కాగా, సంహిత డైలాగులు చెప్పిన విధానం చూస్తే చిరంజీవి జ్ఞప్తికి వస్తారు. మ్యానరిజమ్స్, స్టయిల్, డైలాగ్ డెలివరీ చిరును తలపించేలా ఉన్నాయి. ఆ వీడియో మీరూ చూడండి!

Chiranjeevi
Susmitha
Samhitha
Rani Rudrama
Video

More Telugu News