Sanam Naga Ashok Kumar: సినీ నిర్మాత శానం నాగ అశోక్ కుమార్ కు మాతృవియోగం

Tollywood producer Sanam Naga Ashok Kumar lost his mother
  • నాగ అశోక్ కుమార్ తల్లి చంద్రావతి కన్నుమూత
  • బుధవారం గుండెపోటుకు గురైన చంద్రావతి
  • నాగ అశోక్ కుమార్ కు టాలీవుడ్ ప్రముఖుల సంతాపాలు
టాలీవుడ్ లో అనేక హిట్ చిత్రాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత శానం నాగ అశోక్ కుమార్ కు మాతృవియోగం కలిగింది. నాగ అశోక్ కుమార్ తల్లి చంద్రావతి తుదిశ్వాస విడిచారు. ఆమె వయస్సు 90 సంవత్సరాలు.

పశ్చిమ గోదావరి జిల్లా కైకరంలో ఉంటున్న చంద్రావతి బుధవారం సాయంత్రం గుండెపోటుకు గురయ్యారు. చంద్రావతికి నలుగురు సంతానం కాగా, నాగ అశోక్ కుమార్ రెండోవాడు. తల్లిని కోల్పోయిన నాగ అశోక్ కుమార్ కు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

శానం నాగ అశోక్ కుమార్ శ్రీ సాయి దేవ ప్రొడక్షన్స్ పతాకంపై శుభాకాంక్షలు, వసంతం, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే వంటి చిత్రాలను నిర్మించారు. మాణిక్యం, దొంగదొంగది, నిన్నుచూశాక, మౌనరాగం వంటి చిత్రాలకు కూడా ఆయనే నిర్మాత.
Sanam Naga Ashok Kumar
Chandravathi
Demise
Heart Attack
Tollywood

More Telugu News