సుదీర్ఘ విరామం తర్వాత 'టక్ జగదీష్' షూటింగ్ లో పాల్గొన్న నాని
- సోమవారం టక్ జగదీష్ షూటింగ్ పునఃప్రారంభం
- ఇవాళ సెట్స్ లో అడుగుపెట్టిన నాని
- శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం
తాజాగా హీరో నాని షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. తనే ఈ విషయాన్ని వెల్లడించాడు. 'జగదీష్ జాయిన్స్... టక్ బిగిన్స్' అంటూ కామెంట్ పెట్టాడు. అంతేకాదు, టక్ చేసి, ఓ చేత్తో మాస్కు పట్టుకున్న ఫొటోను కూడా నాని పంచుకున్నాడు.
శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని హరీశ్ పెద్ది, సాహు గారపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.