Kesineni Nani: కలెక్టర్ గారూ... మీరొక ప్రభుత్వ అధికారి అని గుర్తుంచుకోవాలి: కేశినేని నాని

Kesineni Nani objects Krishna district collector tweet about Chandrababu
  • ఎమ్మెల్యే రమేశ్ వ్యాఖ్యలను ట్వీట్ చేసిన కృష్ణా జిల్లా కలెక్టర్
  • తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన కేశినేని నాని
  • తప్పు దిద్దుకోవాలంటూ డిమాండ్
అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ బాబు చేసిన రాజకీయ వ్యాఖ్యలను కృష్ణా జిల్లా కలెక్టర్  ట్వీట్ చేయడం పట్ల టీడీపీ ఎంపీ కేశినేని నాని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మాజీ సీఎం చంద్రబాబులాగా బడాబాబులు, కాంట్రాక్టర్ల వెంట పరిగెత్తకుండా సీఎం జగన్ పేదలు, రైతుల బతుకు మార్చేందుకు చేసిన ఆలోచనకు నిదర్శనమే ఈ బ్యారేజీ నిర్మాణం అని బండికోళ్ల లంక బ్యారేజి గురించి ఎమ్మెల్యే రమేశ్ బాబు పేర్కొన్నారు. అయితే ఆయన వ్యాఖ్యలను కృష్ణా జిల్లా కలెక్టర్ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేసి కలకలం రేపారు.

దీనిపై కేశినేని నాని స్పందిస్తూ, కలెక్టర్ గారూ, మీరొక ప్రభుత్వ అధికారి అని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఒక మాజీ ముఖ్యమంత్రిపై ఒక ఎమ్మెల్యే చేసిన విమర్శను మీరు ట్వీట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. మీ తప్పును వెంటనే సరిదిద్దుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాను అంటూ కేశినేని నాని ట్వీట్ చేశారు.
Kesineni Nani
District Collector
Krishna District
Simhadri Ramesh Babu
Chandrababu
Jagan

More Telugu News