Pawan Kalyan: మరో మల్టీ స్టారర్.. రీమేక్ లో పవన్ కల్యాణ్, రానా!

Pawan Kalyan and Rana act together in a remake flick
  • టాలీవుడ్ లో మల్టీ స్టారర్ చిత్రాల జోరు 
  • 'అయ్యప్పనుమ్ కోషియమ్' రీమేక్  
  • ఆసక్తి చూపుతున్న పవన్ కల్యాణ్
  • మరో కీలక పాత్రలో రానా దగ్గుబాటి
ఇటీవలి కాలంలో మన టాలీవుడ్ లో మల్టీ స్టారర్ సినిమాలు కూడా వస్తున్నాయి. మంచి కథ దొరికి.. అందులోని పాత్రలు తమకు నచ్చితే కనుక ఇలాంటి సినిమాలు చేయడానికి మన హీరోలు ఎటువంటి సంకోచం లేకుండా ముందుకొస్తున్నారు. ఇప్పటికే స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలసి 'ఆర్ఆర్ఆర్' సినిమాలో నటిస్తున్నారు.

ఈ క్రమంలో పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కలసి ఓ చిత్రంలో నటించనున్నారన్న వార్త తాజాగా టాలీవుడ్ లో వినిపిస్తోంది. మలయాళంలో హిట్టయిన 'అయ్యప్పనుమ్ కోషియమ్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి గత కొంత కాలంగా సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ  ప్రయత్నాలు చేస్తోంది.

మొదట్లో ఈ రీమేక్ ను బాలకృష్ణతో చేయాలనుకున్నారు. అయితే, ఆయనకు సినిమా నచ్చకపోవడంతో ఆయన ఈ ప్రాజక్టు పట్ల ఆసక్తి చూపలేదట. తర్వాత ఒకరిద్దరిని అనుకున్నా వాళ్లూ డ్రాప్ అయ్యారు. చివరికి ఇప్పుడీ ప్రాజక్టు పవన్ కల్యాణ్ వద్దకు వచ్చింది. సినిమా చూసిన పవన్ ఇది చేయడానికి మొగ్గుచూపుతున్నారట.

ఇందులో మరో కీలక పాత్ర కోసం రానా దగ్గుబాటిని నిర్మాత సంప్రదించారని, ఆయన కూడా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. అయితే, ఈ ప్రాజక్టుకు ఇంకా దర్శకుడు ఫిక్స్ కాకపోవడం ఇక్కడ విశేషం. త్వరలోనే ఓ యంగ్ డైరెక్టర్ని ఖాయం చేస్తున్నారని సమాచారం.      
Pawan Kalyan
Rana Daggubati
RRR

More Telugu News