Stock Market: నేడు కూడా లాభాలతో ముగిసిన మార్కెట్లు!

Stock Markets ended with profits on a consecutive fifth day
  • ఉదయం మార్కెట్లలో స్తబ్ధత
  • క్రమంగా కొనుగోళ్లతో లాభాల్లోకి  
  • లాభాలు ఆర్జించిన బజాజ్ ఆటో, హీరో, మారుతి
ఈ రోజు కూడా మన స్టాక్ మార్కెట్లు లాభాలలో పయనించాయి. ఉదయం నిస్సారంగా మొదలైన ట్రేడింగ్ ఆ తర్వాత పుంజుకుంది. పలు స్టాకులలో కొనుగోళ్లు జరగడంతో ఆపై రోజంతా అదే ఒరవడి కొనసాగిస్తూ సూచీలు సాయంత్రానికి లాభాలతో ముగిశాయి.  

ముగింపు సమయానికి సెన్సెక్స్ 304.38 పాయింట్ల వృద్ధితో 39,878.95 వద్ద స్ధిరపడగా, నిఫ్టీ 76.50 పాయింట్ల పెరుగుదలతో 11,738.90 వద్ద ముగిసింది. నిఫ్టీ ట్రేడింగ్ లో బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, మారుతి సుజుకి, టైటాన్ కంపెనీ, ఓఎన్జీసీ బాగా లాభపడగా; బజాజ్ ఫైనాన్స్, బీపీసీఎల్, హిండాల్కో, పవర్ గ్రిడ్ కార్ప్, టాటా మోటార్స్ నష్టపోయాయి.

మొత్తమ్మీద రిలయన్స్, టీసీఎస్, హెచ్ డీఎఫ్ సీ వంటి షేర్లు రాణించడంతో భారత స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు కూడా లాభాల బాటలో పయనించాయి.
Stock Market
Profit
NSE
BSE
NIFTY

More Telugu News