Raghunandan Rao: పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. చిక్కుల్లో బీజేపీ నేత రఘునందన్ రావు!

Police seize cash from four members in Shamirpet outer ring road
  • శామీర్ పేట వద్ద రూ.40 లక్షలు పట్టుకున్న పోలీసులు
  • పోలీసుల అదుపులో నలుగురు వ్యక్తులు
  • రఘునందన్ ను పోలీసులు ప్రశ్నించే అవకాశం!
హైదరాబాద్ శివారు ప్రాంతం శామీర్ పేట అవుటర్ రింగ్ రోడ్డు వద్ద పోలీసులు నలుగురు వ్యక్తుల నుంచి రూ.40 లక్షల డబ్బు స్వాధీనం చేసుకున్నారు. వీరిని డీసీపీ పద్మజ విచారించారు. ఈ డబ్బును దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు ఇచ్చేందుకు తీసుకెళుతున్నట్టుగా వారు చెప్పినట్టు తెలిసింది. ఈ డబ్బు నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్నట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నామని బాలానగర్ డీసీపీ పద్మజ తెలిపారు.

డబ్బు తరలిస్తున్న వ్యక్తులకు, రఘునందన్ పీఎ సంతోష్ కు మధ్య ఫోన్ సంభాషణ జరిగినట్టు వెల్లడైందని, దీనికి సంబంధించిన ఆడియోను సేకరించామని చెప్పారు. ఈ డబ్బు పటాన్ చెరు నుంచి సిద్ధిపేట తీసుకెళ్తున్నట్లు తెలిసిందని ఆమె వివరించారు. దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో పెద్దమొత్తంలో నగదు లభ్యం కావడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై పోలీసులు రఘునందన్ ను ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Raghunandan Rao
Cash
Police
Seize
Dubbaka

More Telugu News