Viral Videos: ఆగస్టులో పెళ్లి చేసుకున్నానన్న హీరోయిన్ నీతి టేలర్!

heroin neeti marriage video
  • మిస్‌ నుంచి మిసెస్‌గా మారానన్న నీతి  
  • కరోనా వల్ల లేటుగా చెబుతున్నానని వివరణ
  • విందు గ్రాండ్‌గా చేసుకుంటామని ప్రకటన
‘మిస్‌ నుంచి మిసెస్‌గా మారాను. ఈ విషయాన్ని నన్ను అభిమానించే వారందరికి చెప్పాలని అనుకుంటున్నాను' అంటూ హీరోయిన్  నీతి టేలర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ రోజు ఓ వీడియో పోస్ట్ చేసింది. ఈ ఏడాది ఆగస్టు 13న పరిక్షిత్‌ అనే అబ్బాయిని వివాహం చేసుకున్నానని,  కరోనా కారణంగా కుటుంబ సభ్యులు దగ్గరి బంధువుల సమక్షంలో ఈ పెళ్లి జరగిందని వివరించింది. తనకు చాలా హ్యాపీగా ఉందని, పెళ్లి విషయాన్ని సోషల్‌ మీడియాలో ఇంత ఆలస్యంగా ఎందుకు చెబుతున్నానన్న విషయాన్నీ ఆమె తెలిపింది.

కరోనా పరిస్థితుల నేపథ్యంలో తన పెళ్లి విషయాన్ని దాచిపెట్టినట్లు చెప్పింది. కరోనా సమసిన తర్వాత అంగరంగ వైభవంగా విందు‌ ఏర్పాటు చేసుకోనున్నట్లు వివరించింది. కాగా, హిందీలో ప‌లు పాప్యుల‌ర్ సీరియ‌ల్స్ లో నటించి ఆమె మంచి పేరు తెచ్చుకుంది. ఆమె కుటుంబ ‌స‌భ్యులు మొద‌ట అక్టోబ‌ర్ లో పెళ్లి చేయాలని అనుకున్నారు. అయితే, క‌రోనా కేసులు మ‌రింత పెరిగే అవ‌కాశముంటుందని భావించి ఆగ‌స్టులోనే పెళ్లి జరిపించారు. కాగా, తెలుగులో 'మేం వ‌య‌సుకు వ‌చ్చాం', 'పెళ్లి పుస్త‌కం', 'ల‌వ్ డాట్ కా‌మ్' వంటి సినిమాల్లో ఆమె నటించింది.

    
Viral Videos
Tollywood
marriage

More Telugu News